Sunday, January 19, 2025
HomeTrending Newsకెసిఆర్ ఏం చేసినా ఓట్ల కోసమే - వైఎస్ షర్మిల ఆరోపణ

కెసిఆర్ ఏం చేసినా ఓట్ల కోసమే – వైఎస్ షర్మిల ఆరోపణ

తెలంగాణ రాష్ట్రంలో కేసీఅర్ చేసింది ఏమీ లేదు.. ఏ వర్గానికి న్యాయం చేయలేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పరిపాలన చేతకాక నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాడని మండిపడ్డారు. 125వ రోజు నారాయణ పేట జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. మక్తల్ నియోజక వర్గం ఉట్కూర్ మండల కేంద్రంలో వైఎస్ షర్మిల ప్రజలు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఉట్కూర్ పెద్ద చెరువు పై వైఎస్ షర్మిలకి వినతి పత్రం అందించిన రైతులు. జి ఓ 69 ప్రకారం నారాయణ పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టి.. తమ చెరువులకు నీళ్ళు ఇచ్చేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని విన్నవించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ కేసీఅర్ హయాంలో బాగుపడిన వర్గం లేదు..అంతా మోసమే జరిగిందని ఆరోపించారు. పథకాలు అమలు చేయడం చేతకాదని దుయ్యబట్టారు.

వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలు సైతం బంద్ పెట్టారని, కేసీఅర్ ఏం చేసినా ఓట్ల కోసమే చేస్తారని వైఎస్ షర్మిల అన్నారు. ఎప్పుడొచ్చినా ఓట్ల కోసమేనని… మనం నమ్ముతున్నాం…ఓట్లు వేస్తున్నాం…తర్వాత అంతా బోడి గుండు చేస్తున్నాడని కెసిఆర్ పాలనపై దుమ్మెత్తిపోశారు. 8 ఏళ్లుగా కేసీఅర్ ఆడింది ఆట..పడింది పాటగా ఉందని.. బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు ఏనాడు కేసీఆర్ ను ప్రశ్నించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ లో గెలవడం తెరాస లోకి పోవడం పరిపాటిగా మారిందని, Bjp మతతత్వ పార్టీ అని విమర్శించారు. తెలంగాణను బీజేపీ మోసం చేసిందని, విభజన హామీలు నెరవేర్చి ఉంటే… మన పిల్లలకు కనీసం ఉద్యోగాలు అయినా వచ్చి ఉండేవన్నారు. బీజేపీ కాంగ్రెస్ కు సైతం ఓట్లు వేయద్దని, ఈ రెండు పార్టీలకు రాజకీయాలు తప్పా  ప్రజల సంక్షేమం గురించి పట్టదన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే పార్టీ పెట్టామన్న వైఎస్ షర్మిల వైఎస్సార్ ప్రతి పథకం అమలు చేసి చూపిస్తామని భరోసా ఇచ్చారు.

 

Also Read: కేసీఅర్ కు ఓటు వేస్తె భవిష్యత్తు లేదు – షర్మిల

RELATED ARTICLES

Most Popular

న్యూస్