Saturday, November 23, 2024
HomeTrending Newsహోదా ఇవ్వకపోతే తల్లిని చంపినట్లేగా: షర్మిల

హోదా ఇవ్వకపోతే తల్లిని చంపినట్లేగా: షర్మిల

తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నరేంద్ర మోడీ విస్మరించారని, ఎంతో భక్తి ఉందని చెప్పుకునే వారు కూడా ఇలా మోసం చేస్తే వారికి మనసాక్షి ఉన్నట్లా లేనట్లా అని  ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తిరుపతిలో జరిగిన న్యాయసాధన సభలో ఆమె ప్రసంగించారు.  ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిర్మాణం ఏపీ ప్రజల హక్కుఅని కానీ వాటిని అమలు చేయడంలో మోడీ విఫలమయ్యారని షర్మిల విమర్శించారు. పదేళ్ళలో అభివృద్ధి దిశగా ఏపీ ఒక్క  అడుగు కూడా ముందుకు వేయలేకపోయిందని, తల్లి నుంచి బిడ్డను వేరు చేశారని చెప్పిన మోడీ, తల్లి లాంటి ఎపీకి హోడా ఇవ్వకుంటే తల్లిని చంపినట్లు కాదా అని నిలదీశారు.  జగన్, చంద్రబాబులు ప్రతి విషయంలో బిజెపికి మద్దతు ఇస్తున్నారని, కానీ ఏపీ హక్కుల సాధనలో మాత్రం విఫలమయ్యారన్నారు.

షర్మిల మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • ఢిల్లీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా మన హక్కు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏపి విభజన చట్టంలో పెట్టింది
  • విభజన హామీలు మన హక్కు.  హోదా మన హక్కు,పోలవరం మన హక్కు
  • కడప స్టీల్ మన హక్కు, దుగ్గరాజ పట్నం పోర్ట్ మన హక్కు. ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ మన హక్కు
  • మన హక్కులు మనకు లభిస్తున్నాయా ? లేదా ? అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి
  • హక్కుల సాధనలో బాబు,జగన్ విఫలం. ఒక్క హక్కు మీద కూడా పోరాటం చేయలేదు, కనీసం నిలబడలేదు కూడా
  • విభజన జరిగి 10 ఏళ్లు దాటింది, ఒక్క హామీ కూడా అమలుకు సాధించుకొలేదు
  • హోదా సాధనలో బాబు,జగన్ మాట మార్చారు.  15 ఏళ్లు హోదా కావాలని బాబు అడిగారు
  • తర్వాత హోదా అడిగితే జైల్లో పెట్టారు, ఊసరవెల్లి లా రంగులు మార్చారు
  • ఈయన రంగులు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది
  • జగన్ ఆన్న 25ఎంపీలు కావాలని అడిగారు. హోదా కోసం దీక్షలు చేశారు
  • ఎంపీలు రాజీనామా చేస్తే హోదా ఎందుకు రాదో చూద్దాం అన్నాడు. కేంద్రంపై పంజా విసురుదాం అన్నాడు
  • పులిలా గర్జించి అధికారం రాగానే పిల్లి అయ్యాడు. బీజేపీ కి బానిస అయ్యాడు. మోడీకి వంగి వంగి దండాలు పెడుతున్నాడు.

  • కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రం మంది,  మన రాజధాని ఏది అంటే ఏం చెప్తాం
  • ఒక ముఖ్యమంత్రి 3D గ్రాఫిక్స్ చూపించారు. ఒక ముఖ్యమంత్రి 3 రాజధానులు అన్నాడు
  • 10 ఏళ్లలో ఏపికి ఏ రాజధాని లేదు, హోదా కోసం రాష్ట్రంలో యువత హత్మహత్యలు చేసుకుంటున్నారు
  • ఇదే గ్రౌండ్ లో ముని కోటి అనే యువకుడు పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. ఈ పాపం బీజేపీది, బాబుది, జగన్ ది
  • ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. మోసం చేసిన బీజేపీతో మళ్ళీ పొత్తులకు సిద్ధం అవుతున్నారు
  • రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్న వీళ్ళు మనకు అవసరమా ?
  • ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం మోడీ దగ్గర తాకట్టు పడింది
  • రెండు పార్టీలు మోడీకి ఊడిగం చేస్తున్నాయి
  • మోడీ ఇద్దరినీ చేతుల్లో పెట్టుకొని ఆట అడిస్తున్నాడు
  • అందుకే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇవ్వండి

“మార్చి 1, 2014న నాటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ కేబినెట్ చేసిన నిర్ణయానికి.. మార్చి 1, 2024 నాటికి 9 ఏళ్ళు పూర్తయి 10 సం.లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా…
ప్రజలు కలియుగ దైవంగా భావించే ఈ తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో.. నాడు నరేంద్ర మోడీ హామీ ఇచ్చిన స్థలంలోనే….
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జరుగుపుతున్న ఈ న్యాయ సాధన సభలో 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కోసం జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుమతితో ఈ డిక్లరేషనను ప్రకటిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు తీవ్రమైన అప్పుల ఊబిలోకి నెట్టబడింది. ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు న్యాయంకావాలి… భరోసా కావాలి..అందుకే.. జాతీయ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు 10 ఏళ్ళపాటు ప్రత్యేక తరగతి హెూదా అమలు చేస్తూ నిర్ణయం చేస్తుందని ఈ తిరుపతి సభ ద్వారా ప్రకటిస్తున్నాం” అంటూ ఓ డిక్లరేషన్ ను  ఈ సభలో విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో రాజస్థాన్ కు చెందిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ నేతలు కెవిపి రామచంద్రరావు, రఘువీరారెడ్డి, గిడుగు రుద్ర రాజు, డా. తులసి రెడ్డి తదితరులు పాల్తోన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్