Saturday, January 18, 2025
HomeTrending Newsదాడి ఘటనపై విచారణ చేయించండి: ఈసీకి వైసీపీ వినతి

దాడి ఘటనపై విచారణ చేయించండి: ఈసీకి వైసీపీ వినతి

ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై నిన్న బస్సుయాత్ర సందర్భంగా విజయవాడలో జరిగిన దాడి వెనక కుట్ర కోణం ఉందని పార్టీ రాష్ర్ట ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై దాడి ఘటనపై సచివాలయంలోని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందించారు. సజ్జలనేతృత్వంలో ఎంపీ లు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, నందిగామ సురేష్, ఎమ్మెల్సీ  లేళ్ళ అప్పిరెడ్డి, ఎంఎల్ఏ మల్లాది విష్ణు,మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు,పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ మనోహర్ రెడ్డి లు ఫిర్యాదు చేశారు.

సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ…..

  • బస్సు యాత్ర సందర్భంగా జగన్ గారిపై దాడి రాష్ర్టమంతటిని కుదిపేసింది. అంతా షాక్ గురయ్యారు.కేవలం అదృష్టం మాత్రమే జగన్ గారిని కాపాడింది.
    ఆ రాయి లేదా ఉపయోగించినది ఏదైనా సరే కొంచెం కిందకు తగిలినా కనుచూపు పోయేది.అలాగే కణతకు తగిలితే ప్రాణాపాయం ఉండేది.
  • సంఘటనను దేశం అంతా ఖండించింది. ప్రధాని నరేంద్రమోదిగారు కూడా ఖండించారు. పలు పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలంతా కూడా ఖండించి జగన్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
  • కాని ఇక్కడ మన రాష్ర్టంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కూడా ఖండించినప్పటికీ ఆ పార్టీ సీనియర్ నేతలు,పార్టీ జాతీయప్రధానకార్యదర్శి అయిన లోకేష్ జరిగిన దుర్గటన అంతా డ్రామా అని విమర్శలు చేశారు.
  • జగన్ గారు తనంతట తాను చేయించుకున్నడ్రామాగా వర్ణించడం, హేళన.. అబ్యూజ్ చేయడం…కోడికత్తి 2.0 అనడం….అసలు వీళ్ళు మనుషులా.. రాక్షసులా అన్నట్లుగా ప్రవర్తించడం హేయమైన విషయం.
  • ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల కమీషన్ ఆధీనంలోనే ఇప్పుడు అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి.
  • దాడి జరగడానికి కారణం ఎవరని మరోకోణంలో చూసినట్లయితే చంద్రబాబు ఈ మధ్యనే కాదు చాలా రోజులనుంచి టిడిపి కార్యకర్తలను,ప్రజలను రెచ్చగొట్టేరీతిలో మాట్లాడటం జరగుతోంది.
  • ప్రస్టేషన్ నిరాశా నిసృహల మద్య మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి,పార్టీ అధ్యక్షుడు అనే విషయం గుర్తించకుండా సాటి మనిషి అనికూడా జగన్ గారిని గుర్తించకుండా చంద్రబాబు రెచ్చగొట్టారు.
  • బస్సుయాత్ర ప్రారంభమైనప్పటినుంచి జగన్ గారికి ప్రజలలో విపరీతమైన మధ్దతు లభించడం చూస్తున్నారు.
  • విజయవాడ చేరుకునేసరికి అది మరింతగా పెరిగింది. అదంతా చూసి తట్టుకోలేక రెచ్చగొట్టేవ్యాఖ్యలు మరింతగా పెంచారు. ఇలాంటి భాష గతంలో ఎన్నడూ వినలేదు.
  • రాయి తీసుకోండి…దున్నపోతును ఓడించండి అనడమే కాదు మీరు కన్నెర్ర చేయండి జగన్ గారిని మసి చేయండి అంటూ దారుణంగా మాట్లాడారు.
  • మొత్తంగా చూస్తే ఓ పధకం ప్రకారం కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్ ఆన్ లైఫ్ త్రెట్ అనేది మా పార్టీ అధ్యక్షుడు జగన్ గారిపై జరిగింది.
  • రాజకీయ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేరు. చంద్రబాబు రెచ్చగొట్టి ఇలాంటివి చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు ఎన్నికల కమీషన్ కు నివేదించాం.
  • గత కొన్ని రోజులుగా కూడా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసామన్నారు. ఈసి కూడా టిడిపి వారికి నోటీసులు ఇస్తున్నట్లున్నారు. కాని ఫలితం కనపడటం లేదు.
  • ఇకపై ఇలాంటి రెచ్చగొట్టేస్పీచ్ లు చేయకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని ఈసిని కలసి కోరామని వివరించారు.
  • సంఘటనపై విచారణ చేయమని డిజిపిని కలసి పార్టీనేతలు ఫిర్యాదు చేస్తారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్