Saturday, June 29, 2024
HomeTrending Newsపోస్టల్ బ్యాలట్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ

పోస్టల్ బ్యాలట్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ

పోస్టల్ బ్యాలెట్ అంశంలో  ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమోపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజ్య సభ సభ్యుడు  ఎంపీ నిరంజన్ రెడ్డి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు ఈ మెయిల్ పంపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఇచ్చిన మెమో భారత ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేదుకు దారితీసేలా ఉందని… ఈ మెమోను తక్షణమే సమీక్షించి, తగు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు వైఎస్సార్సీపీ విజయంపై ధీమాగా ఉంది. తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అంటూ దానికి సూచీగా కేంద్ర కార్యాలయం ముందు కౌంట్ డౌన్ బోర్డు కూడా ఏర్పాటు చేసింది. తాము ఆశించిన విధంగా సీట్ల సంఖ్య రాకపోయినా అధికారం తిరిగి నిలబెట్టుకోవడం ఖాయమని… ఈ విషయంలో ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్