Tuesday, January 21, 2025
HomeTrending News13వ వసంతంలోకి వైఎస్సార్సీపీ

13వ వసంతంలోకి వైఎస్సార్సీపీ

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  రేపు 13వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి పూలమాలలతో అలంకరించి,  ఆవిర్భావ వేడుకలను ఘ‌నంగా నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాల‌యం పిలుపునిచ్చింది. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జరిగే వేడుకలో పార్టీ ముఖ్య నేత‌లు పాల్గొంటారు.

2011 మార్చి 12వ తేదీన ఇడుపులపాయ‌లో దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌మాధి చెంత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. తొలిసారి ఈ పార్టీ గుర్తు పై పోటీ చేసి నాటి ఉప ఎన్నికల్లో 16 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. 2014  ఎన్నికల్లో పార్టీ 67 సీట్లు గెల్చుకుంది. 2019లో మొత్తం 175  సీట్లకు గాను 151 స్థానాల్లో విజయ దుందుభి మోగించి అధికారం చేపట్టింది.

అధికారం చేపట్టి మరో రెండు నెలల్లో నాలుగేళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్