We don’t need: రాష్ట్రంలో మరో ఇరవై ఐదేళ్లపాటు తామే అధికారంలో ఉంటామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే కొందరు పొత్తుల కోసం ఆరాట పడుతున్నారని, ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని అయన తేల్చి చెప్పారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని, అయనపై ప్రజల్లో విశ్వాసం లేదని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని అయన వెల్లడించారు. ప్రజల మద్దతు లేనివారే పొత్తుల కోసం ఎదురు చూస్తారంటూ వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు తన సామాజిక వర్గం మీదే ప్రేమ అని, కానీ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, కులాలు, మతాలకు అతీతంగా సిఎం జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని విజయసాయి వివరించారు. టిడిపి నాయకత్వమే ఆ పార్టీ కార్యకర్తలు, గుండాలతో సమాజంలో అశాంతిని. ఆకృత్యాలను చేయిస్తోందని విజయసాయి ఆరోపించారు.
Also Read : నేటినుంచి మూడో జాబ్ మేళా: విజయసాయి