Saturday, March 1, 2025
HomeTrending NewsFake News: టిడిపి నేతలపై ఫేక్ ప్రచారం: కొల్లు

Fake News: టిడిపి నేతలపై ఫేక్ ప్రచారం: కొల్లు

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల పేరుతో లబ్ధిదారులను సిఎం జగన్ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి నేత కొల్లు రవీంద్ర విమర్శించారు. తనకున్న మీడియా, పేపర్, సోకాల్ మీడియాల  ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఏ ఒక్కరి ఖతాల్లోనూ డబ్బులు పడలేదని ఆరోపించారు. గతంలో తమ హయంలో కళ్యాణ లక్ష్మి ద్వారా సాయం అందించిన వారి ఫోటోలు, పేర్లు ఇప్పుడు చూపిస్తున్నారని… నవీన్ కుమార్, నర్రా పుల్లయ్య,  దాచేపల్లి ఎంపిపి పేరును కొల్లు ప్రస్తావించారు.

నాలుగేళ్ళపాటు ఈ పథకాన్ని అమలు చేయకుండా, ఇప్పుడు  తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. విదేశీ విద్య పథకంలో కూడా ఒక్కో విద్యార్ధి రెండు యూనివర్సిటీల్లో చదువుతున్నట్లు చూపిస్తున్నారన్నారు.

టిడిపి నేతలపై ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని, అమరావతి లో భూములు తీసుకుంటే తరిమికొడతామని అచ్చెన్నాయుడు అన్నట్లు, అమ్మ ఒడి పథకాన్ని నిలిపి వేస్తామని లోకేష్…, వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని టిడిపి నేతలు చెప్పినట్లు కూడా ప్రచారం చేస్తున్నారని రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబు, లోకేష్ దళితులపై ఏవోవ్యాఖ్యలు చేశారంటూ మార్ఫింగ్ వీడియోలతో లబ్ధిపొందాలని, వారిని  రెచ్చగొట్టాలని చూస్తున్నారని… సునీత తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రవీంద్ర అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్