Sunday, February 23, 2025
HomeTrending Newsలోకేష్ కు బుర్ర ఉందా? మార్గాని భరత్

లోకేష్ కు బుర్ర ఉందా? మార్గాని భరత్

లోకేష్ ఉత్తర కుమారుడని ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసనీ వైఎస్సార్సీపీ నేత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. మంత్రి పెద్దిరెడ్డికి కుప్పంలో ఏం పని అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై భరత్ తీవ్రంగా స్పందించారు. కేబినెట్ మంత్రిగా ఆయన రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికైనా వెళ్ళే హక్కు ఉంటుందని, కనీస అవగాహన, బుర్ర లేకుండా లోకేష్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కార్పొరేటర్ గా, కనీసం కౌన్సిలర్ గా కూడా గెలవలేని లోకేష్ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి,  మంత్రిగా మూడు శాఖలు వెలగబెట్టి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు.  భీమిలి నుంచి పోటీ చేస్తానని అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారని, లోకేష్ కు దమ్ముంటే రాజమండ్రి లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. గతంలో ఏడాదికి ఒకసారి సంక్రాంతి పండుగకు కుప్పం వెళ్ళే చంద్రబాబు సిఎం జగన్ దెబ్బకు నెలకు నాలుగురోజులు వెళుతున్నారని వ్యంగాస్త్రం సంధించారు.

బిజెపి-టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తాయంటూ ఎల్లో మీడియాలో ఊదర గొడుతోందని  మార్గాని ఎద్దేవా చేశారు. ధర్మ పోరాట దీక్షల పేరుతో మోడీని వ్యక్తిగతంగా తిట్టి, తిరుపతిలో అమిత్ షా పై రాళ్ళు వేయించి ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని పొత్తుకోసం వెంపర్లాడుతున్నారని నిలదీశారు.

సిఎం జగన్ నాయకత్వంలో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో దూకుకు వెళుతోందని చెప్పారు. పునరుత్పాదక విద్యుత్, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని… బిర్లా సంస్థ ద్వారా గ్రాసిమ్ ఇండస్ట్రీ వచ్చిందని, కాకినాడ పార్లమెంట్ తొండంగి లో బల్క్ డ్రగ్ పరిశ్రమకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని భరత్ వివరించారు.

Also Read : పెద్దిరెడ్డికి అక్కడ ఏం పని: లోకేష్ ప్రశ్న  

RELATED ARTICLES

Most Popular

న్యూస్