Sunday, January 19, 2025
HomeTrending Newsసవరించిన అంచనాలు ఆమోదించాలి

సవరించిన అంచనాలు ఆమోదించాలి

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ విషయంపై చర్చించాలని కోరుతూ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసులిచ్చారు. విపక్షాలతో పాటు వైఎస్సార్ సీపీ ఎంపీల ఆందోళనలతో సభకు అంతరాయం కలిగింది.

ఆ తరువాత వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ….

  • పోలవరం ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు
  • పోలవరం నిర్మాణం పూర్తి బాధ్యత కేంద్రానిదే
  • వచ్చే ఏడాది ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  • భూసేకరణ, పునరావాసం సంబంధించిన అన్ని అంశాలను కేంద్ర జలశక్తి శాఖ కమిటీలన్నీ ఆమోదించాయి.
  • సవరించిన అంచనాల ఆమోదంలో ఏలాంటి జాప్యం చేయవద్దు.
  • దశలవారీగా అర్ అండ్ అర్ నిధులను విడుదల చేయాలి.
  • ఆర్‌ అండ్ ఆర్ ప్యాకేజీ ఆమోదిస్తేనే నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయగలుగుతాం
  • పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు వరప్రదాయని.
  • ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంటును స్తంభింపజేశాం.
  • దీనితో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం

అని ఎంపీలు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్