Sunday, January 19, 2025
HomeTrending Newsటిడిపిని రద్దు చేయండి : ఈసీకి వైసీపి వినతి

టిడిపిని రద్దు చేయండి : ఈసీకి వైసీపి వినతి

Ysrcp Mps Meet Election Commission Of India Requested To De Recognize Tdp :

తెలుగుదేశం పారీ గుర్తింపును రద్దు చేయాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలోని నిర్వచన భవన్ లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వైసీపీ ఎంపీలు సమావేశమయ్యారు. టిడిపి నేతలు పట్టాభి, దేవినేని ఉమా, నారా లోకేష్, బొండా ఉమా, అయ్యన్న పాత్రుడు  చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకు వెళ్ళారు.  వినతి పత్రం సమర్పించిన అనంతరం సహచర ఎంపీలతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.

టిడిపి అనేది తెలుగు దొంగల పార్టీ అని, రాష్ట్రంలో ఒక టెర్రరిస్ట్ సంస్థలా వ్యవహరిస్తోందని, తాలిబాన్ కంటే దారుణంగా ప్రవర్తిస్తోందని అయన మండిపడ్డారు.  రాజ్యంగబద్ధంగా ఎన్నికైన సిఎం జగన్ పై పట్టాభి ఉపయోగించిన అసభ్య పదజాలం పై ఎన్నికల సంఘం అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారని, ఈ సంఘటనపై కేసు నమోదు చేశారా అని ప్రశ్నించారని, ఎఫ్ ఐ ఆర్ వివరాలు పంపాలని కోరారని విజయసాయి వెల్లడించారు.

దీనితో పాటు ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలిలో 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయని, వీటిలో 11 మందిని స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారని, మిగిలిన ముగ్గురినీ ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి ఉందని, వెంటనే ఈ ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరామని, దీనిపై ఎన్నికల సంఘం కమిషనర్లు సానుకూలంగా స్పందించారని  విజయసాయి వివరించారు. ఎంపీల బృందంలో మార్గాని భరత్, రెడ్డప్ప, డాక్టర్ సత్యవతి, తలారి రంగయ్య, డాక్టర్ సంజీవ్ , గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్ తదితరులు ఉన్నారు.

Must read: వైయస్సార్‌బీమా సరళతరం: సిఎం జగన్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్