Tributes to Bipin:
ఆర్మీ హెలికాఫ్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ భౌతిక కాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి నివాళులర్పించారు. బిపిన్ రావత్ తో పాటు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి పార్దీవ దేహాలను నిన్న రాత్రి ఢిల్లీ పాలెం ఎయిర్ పోర్ట్ కు తీసుకు వచ్చారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ అధికారులు, త్రివిధ దళాల ఉన్నతాధికారులు నివాళులర్పించారు. నేటి ఉదయం బిపిన్, మధులిత రావత్ దంపతుల బౌతిక కాయాలను కామరాజ్ మార్గ్ లోని అయన నివాసానికి తరలించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, వివిధ పార్టీల నేతలు, ఎంపీలు శ్రద్ధాంజలి ఘటించారు. వైసీపీ ఎంపీలు విజయసాయి, వంగా గీతలు… రావత్ దంపతుల పార్దీవ దేహాల వద్ద పూలమాల వేసి అంజలి సమర్పించారు.
ఇటీవలే పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో రావత్ ను కలుసుకున్నానని, మాతృభూమి పట్ల ఆయనకున్న ప్రేమ, దేశభక్తి తనను ఎంతో ఆకట్టుకున్నాయని విజయసాయి వెల్లడించారు.
సిఎం జగన్ తరపున రావత్ దంపతులకు నివాళి అర్పించామని, ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనవని, కుటుంబం అంతా దేశ సేవలోనే తరించిందని విజయసాయి పేర్కొన్నారు.
Also Read : ఆర్మీ హెలికాప్టర్ ఘటనలో ఏపీ వాసి మృతి