Friday, November 22, 2024
HomeTrending Newsతెలంగాణ ప్రాజెక్టులపై ప్రస్తావిస్తాం

తెలంగాణ ప్రాజెక్టులపై ప్రస్తావిస్తాం

తెలంగాణ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. అనంతరం విజయసాయిరెడ్డి సమావేశ వివరాలను మీడియాకు వివరించారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారని విజయసాయిరెడ్డి చెప్పారు. నీటి పంపకాల్లో తమకు కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని, ఒక్క చుక్క కూడా అదనంగా వాడుకోవడంలేదని అయన స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు విద్యుత్ బకాయిలు 6,112 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, ఈ అంశాన్ని కూడా పార్లమెంట్ లో లేవనెత్తుతామని విజయసాయిరెడ్డి చెప్పారు.

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని లేవనెత్తుతాం, ప్రైవేటీకరణ చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తాం
  • చంద్రబాబు హయాంలో తెలంగాణాలో ఐదు ప్రాజెక్టులు కట్టారు
  • పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన పెండింగ్ నిధులను అడుగుతాం
  • విభజన హామీలను అమలు చేయాలని కోరతాం
  • దిశ చట్టాన్ని ఆమోదించాలని కోరతాం
  • కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశాన్ని ప్రస్తావిస్తాం
  • కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా తగ్గుతున్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తాం
  • ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నాం
  • చంద్రబాబు ప్యాకేజీ కోసం హోదా అంశాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారు
  • కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిని నోటిఫై చేయాలి
  • ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రం నుంచి లబ్ధి పొందేవారి సంఖ్యను పెంచాలి
  • రేషన్ బియ్యం బకాయిలను చెల్లించాలి
  • రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో మౌలిక వసతులు కల్పించాలి
  • గిరిజన యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలి
RELATED ARTICLES

Most Popular

న్యూస్