Saturday, November 23, 2024
HomeTrending NewsYSRCP: జెండా ఇచ్చారు, ఎగరేయాల్సిన బాధ్యత మనదే : తమ్మినేని

YSRCP: జెండా ఇచ్చారు, ఎగరేయాల్సిన బాధ్యత మనదే : తమ్మినేని

జగన్ సాధికారత జెండాను వెనుకబడిన వర్గాలకు ఇచ్చారని, దీనికి ఎగురవేయాల్సిన బాధ్యత మనపైనే ఉందన్న విషయాన్ని అందరం గుర్తించాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపు ఇచ్చారు. సాధికారత అనేది పూర్తికాలేదని, జగన్ ఇప్పుడిప్పుడే ఆరంభం చేసి ఇచ్చారని, ఇది ఓ మహా విప్లవమై విస్తరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మన్యం సీమలోని పాలకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాలకొండ జంక్షన్ లో ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో స్పీకర్ తమ్మినేనితో పాటు డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంతరులు మేరుగ నాగార్జున,  సీదిరి అప్పలరాజు, మాజీ డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణి. అరకు ఎంపీ గొట్టేట మాధవి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రపై దేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. అణగారినవర్గాలను జగన్ గుర్తించి, గౌవరం ఇవ్వడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారన్నారు. 139 వెనుకబడిన కులాలను గుర్తించి 56 కార్పొరేషన్ లు వేసి నిధులు, విధులు ఇచ్చి ఆత్మాభిమానాన్ని జగన్ పెంచారన్నారు.  రాజ్యాంగంలో వెెనుకబడిన వర్గాలకు అన్ని అంశాలను పొందుపరిచినా ఎవరికీ చేరలేదని, జగన్ ప్రభుత్వంలోనే రాజ్యాధికారం, రాజ్యాంగ పదవులు వచ్చాయన్నారు

శ్రీశైలం నియోజకవర్గంలో 

బీసీ డిక్లరేషన్‌ ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేస్తానని జగనన్న ఎన్నికలకు ముందే చెప్పారని, చేసి చూపించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి  కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కేబినెట్‌లో అణగారిన వర్గాలకు మన స్థాయిలో పెద్దపీట వేయలేదని, ఈ ఘనత జగనన్నకే దక్కుతుందని అన్నారు. తన వర్గం, తన వారి బాగు కోసమే పనిచేసిన కుత్సిత స్వభావి చంద్రబాబు అయితే… సామాజిక సాధికారతను సాకారం చేసి బడుగు, బలహీనవర్గాల ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్న మనసున్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు.

శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో జరిగిన సామాజిక సాధికార యాత్రకు అపూర్వ స్పందన లభించింది.  ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో డిప్యూటీసీఎం అంజాద్‌బాషా, మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు ఆర్థర్, హఫీజ్‌ఖాన్ లతో పాటు ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల నాయకులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల ప్రజలు వైఎస్సార్‌సీపీ పార్టీ గుండె చప్పుళ్లయ్యారని అభివర్ణించారు.  శ్రీశైలం నియోజకవర్గంలో సంక్షేమపథకాల ద్వారా లబ్దిదారులకు డీబీటీ ద్వారా రూ.764 కోట్లు, నాన్‌డీబీటీ ద్వారా 284 కోట్ల రూపాయలు అందాయని వెల్లడించారు. సిఎం జగన్ సమాజంలోని అట్టడుగు వర్గాలను గుండెకు హత్తుకుని, సమానావకాశాలు కల్పిస్తున్నారన్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూడలేని ప్రతిపక్షం గుడ్డిగా విమర్శిస్తోందని దుయ్యబట్టారు.

జగ్గయ్యపేటలో….

సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను గారి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మంత్రులు ధర్మాన ప్రసాద రావు, విడదల రజిని, ఎంపిలు నందిగం సురేష్, అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రి  కొలుసు పార్ధ సారథి, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్ రావు, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, వసంత కృష్ణ ప్రసాద్, జడ్పీ ఛైర్మన్ ఉప్పల హారిక, రాము దంపతులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్