నాగవళి, వంశధార నదులు కలసి పోటెత్తుతున్నట్లుగా సామాజిక సాధికార బస్సుయాత్రకు ప్రజలు తరలివచ్చారని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి సంతోషం వ్యక్తం చేశారు. జనసందోహాన్ని చూస్తుంటే ఇది నరసన్నపేట కాదు జగనన్న అభిమాన కోటగా కనిపిస్తోందని అభివర్ణించారు. బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు గర్వంగా తలెత్తుకునేలా జగన్ చేశారని, అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. జగనన్న నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో 175 సీట్లు ఖచ్చితంగా గెలుచుకోవడం ఖాయమని ధీమా వెలిబుచ్చారు.32 లక్షల ఇల్లు పేదలకు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ వంటి నేతలను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండో విడత సామాజిక సాధికార యాత్ర శ్రీకాకుళం జిల్లా నరనస్నపేట నియోజకవర్గంలో జనం జయజయ ధ్వానాల హోరులో ఉత్సాహంగా ప్రారంభమైంది. బస్సు యాత్రలో పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల తీరును పరిశీలించి లబ్ధిదారులతో ముచ్చటించారు. నరసన్నపేట పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు స్పీకర్ తమ్మినేని సీతారామ్, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదారవు, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి, రెడ్డి శాంతి తదితరులు హాజరయ్యారు.
రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, సమర్థవంతమైన, సమగ్రమైన సంక్షేమ పాలన జగన్ చేస్తున్నారని, రాష్ట్రంలో జరిగిన మార్పులను అంతా గమనించాలని కోరారు. ప్రజలకు అవసరమైన వసతులు, సౌకర్యాలను జగన్ పాదయాత్ర చేసినపుడు గమనించి, సీఎం కాగానే అమలు చేశారని, దీని కోసం ఎవరూ యుద్ధాలు, పోరాటాలు చేయలేదని వ్యాఖ్యానించారు. వెనుకబడిన వర్గాలు తమ అవసరాల కోసం అడగడానికి బలం, బలగాలు లేకుండా పోయాయని, కానీ జగన్ మాత్రం బడుగులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. 29 రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు, ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నారని, ఏ రాష్ట్రంలో మన రాష్ట్రం కంటే తక్కువగా నిత్యావసర వస్తువుల ధరలు ఉన్నాయో చెప్పాలని విపక్షాలను ధర్మాన డిమాండ్ చేశారు.
హిందూపురంలో
బెంగళూరులో బీసీ నాయకులు కొందరు తనను కలిసి ఆయా ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని అడిగారని, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య వెల్లడించారు. ఎందుకంటే బీసీ పేదపిల్లలకు ఆంధ్రప్రదేశ్‌లో బాగా చదువుకునే అవకాశాలున్నాయని , వారికి మంచి అవకాశాలు వస్తాయని తనతో చెప్పారని వివరించారు. చదువుకునే పిల్లలకు స్కూలు స్థాయి నుంచి ప్రొఫెషనల్ కోర్సుల వరకు ప్రభుత్వం చేయూతనిస్తోందని, పేదల బాధలకు చలించిపోయే కరుణామయుడు జగన్‌మోహన్‌రెడ్డి అని కృష్ణయ్య ప్రశంసించారు. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లోనూ వారికోసం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పథకాలు లేవని స్పష్టం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయనాయకుడు కాదు సంఘసంస్కర్త అని అభివర్ణించారు. పక్కరాష్ట్రాలకు పోయి చూస్తే.. ఇక్కడ జగనన్న చేస్తున్న మంచి మనకు అర్థమవుతుందన్నారు.
హిందూపురం నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా సాగింది. అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అడుగడుగునా సామాజిక సాధికారత ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు అంజాద్ బాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, ఎంపీలు ఆర్. కృష్ణయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే శంకరనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పొన్నూరులో
ఎన్టీఆర్‌పై అభిమానంతో 19 సంవత్సరాలు టీడీపీలో ఉన్నానని, కానీ ఆ పార్టీ తనను కరివేపాకులా వాడుకొని తీసేసిందని సినీ నటుడు ఆలీ ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే జగనన్నతో కలిసి నడిచేందుకు నిర్ణయించుకున్నానని, వైఎస్ కుటుంబం తనకేమీ కొత్త కాదని, ఎప్పటి నుంచో పరిచయం ఉందని వివరించారు. సామాజిక సాధికార బస్సు యాత్ర పొన్నూరులో జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు, ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నేతలు మాట్లాడుతున్నంతసేపూ జనం ఆసక్తిగా విన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, ఎంపీలు అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కిలారి వెంకటరోశయ్య, ముస్తఫా, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, మర్రి రాజశేఖర్, జూపూడి ప్రభాకర్‌రావు, నటుడు ఆలీ తదితరులు పాల్గొన్నారు.
అలీ మాట్లాడిన ముఖ్యాంశాలు:
* 2020లో భయంకరమైన కోవిడ్ వచ్చింది. రాజమండ్రి నుంచి కమిషనర్ ఒకాయన ఫోన్ చేసి.. ఎయిర్‌పోర్టు పక్కన మీకున్న స్థలం ఇచ్చేస్తే పేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు.
* అక్కడ కొంత మంది రైతులు కండిషన్లు పెట్టారు. ఆలీగారు స్థలం ఇస్తే మా స్థలం కూడా ఇచ్చేస్తామన్నారు అని..
* ఎంత కావాలని అడిగాను. 55 ఎకరాలు కావాలని సీఎం గారు చెప్పారన్నారు.
* వెనకా ముందూ ఆలోచించకుండా గవర్నమెంట్ రేటుకే నా స్థలం ఇచ్చేశాను.
* ఎందుకంటే ప్రతి పేదవాడికీ ఒక గూడు కావాలని కోరుకుంటాడు. అదే జగనన్న కోరుకున్నాడు.
* మా ముస్లిం సోదరులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులకు ఇళ్లు అందుతాయి.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని దగ్గర చేసుకొని పాదయాత్ర చేస్తున్నప్పుడు జగనన్న కడుపు తడిమిచూశాడు.
* ఆకలి తీర్చేందుకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి, పాదయాత్ర అయిన తర్వాత ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు అందించారు.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడిన అంశాలు:
* సామాజిక వర్గాలకు చేసిన మంచిని తెలిపేందుకు మమ్మల్ని జనం వద్దకు పంపితే అడుగడుగునా జేజేలు పలుకుతున్న పరిస్థితి.
* అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి, ఆయన ఆశయ సాధకుడు జగనన్నకు మన వర్గాలు ఓటు వేయడం ద్వారా ఈ సామాజిక సాధికారత వచ్చింది.
* చంద్రబాబుకు సామాజిక సాధికారత అంటే ఆయన సామాజిక వర్గమే.
* మిగతా కులాలన్నీ దాస్యవృత్తులకో, చులకనగా చూడటానికో అన్నట్లు చూశారు.
* వివక్షతో చూసిన వర్గాలను నా వర్గాలు అన్న నాయకుడు జగనన్న.
* పేద వాడి జీవితాన్ని మార్చడానికి భగవంతుడు శక్తి ఇస్తే మార్పు తెస్తాననన్న జగనన్న. పేదరికాన్ని జయించేందుకు 9 పథకాలు తెచ్చాడు.
* అబద్ధాన్ని తొలగించగల శక్తి నిజానికి ఉంది. జగనంటే నిజం.
* కరోనా వచ్చినా పింఛన్లు, అమ్మ ఒడి, సంక్షేమ పథకాలు ఆగలేదు.
* చంద్రబాబు అంటే అబద్ధం. రైతు రుణమాఫీ చేయలేదు.
* చంద్రబాబు అనే అబద్ధం వద్దు. నిజం అనే జగన్ ముద్దు. ఆపు బాబూ నీ నాటకం. జగనే మా నమ్మకం.