నాలుగున్నర సంవత్సరాలుగా ఎస్సీలు, ఎస్టీలు, బిసిలు, మైనార్టీలకు ప్రభుత్వం చేసిన మేలును వివరిస్తూ, ఆయా వర్గాలకు పరిపాలనలో కల్పించిన భాస్వామ్యం తెలియజెబుతూ సామాజిక సాధికారత కోసం చేపట్టిన చర్యలను ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్ సీపీ గురువారం నుంచి సామాజిక సాధికారత బస్సుయాత్రను చేపడుతోంది. గత 53 నెలలుగా జగన్ ప్రభుత్వంలో జరిగిన సామాజిక విప్లవాన్ని, సంక్షేమాభివృద్ధిని పార్టీ నేతలు వివరించనున్నారు.
ప్రతిరోజూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్రలు జరగనున్నాయి. రేపు తొలిరోజుల ఉత్తరాంధ్రలో ఇచ్ఛాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమలోని శింగనమలలో ఒకేసారి యాత్ర ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ సమన్వయకర్త సారధ్యంలో ఈ యాత్రలు డిసెంబరు 31 వరకూ కొనసాగనున్నాయి.
- సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లోకి రూ.2.38 లక్షల కోట్లు
- ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఖాతాల్లోకే
- ప్రత్యక్ష నగదు బదిలీయేతర పథకాల ద్వారా పేదలకు మరో రూ.2.33 లక్షల కోట్లు
- స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
- ఇందులో 2.07 లక్షల ఉద్యోగాలు గడిచిన 53 నెలల్లోనే… అంటే 50 శాతానికి పైనే
- అందులో 80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే.. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ సింహభాగం పదవులు ఆ వర్గాలకే అందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నిరుపేద సామాజిక వర్గాలన్నింటినీ కలుపుకొని వెళ్ళే యాత్రగా ఉంటుందని, పేదవాడికి జరిగిన మంచిని వివరించే యాత్ర- పేదవాడి తరపున నిలబడే యాత్ర అని పార్టీ నేతలు అభివర్ణించారు.