ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. మొత్తం 50 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో 3 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. నేడు ఓట్ల లెక్కింపు లెక్కింపు జరిగిన 47 డివిజన్లలో 44 వైసీపీ; 3 తెలుగుదేశం గెలుచుకున్నాయి. మార్చి 10వ తేదీనే ఎన్నికలు జరిగినప్పటికీ కోర్టు కేసు కారణంగా కౌంటింగ్ వాయిదా పడింది. విచారణ అనంతరం మే 7న కౌంటింగ్ కు హైకోర్టు అనుమతించింది. కోవిడ్ కారణంగా కౌంటింగ్ ఆలస్యమైంది.
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఈ నెల ౩౦ న ఎన్నిక నిర్వహిస్తారు.