Sunday, January 19, 2025
Homeసినిమాగ్లామర్ పరంగా మార్కులు కొట్టేసిన యుక్తి తరేజా! 

గ్లామర్ పరంగా మార్కులు కొట్టేసిన యుక్తి తరేజా! 

టాలీవుడ్ కి ఎక్కువగా మోడలింగ్ నుంచి అమ్మాయిలు వస్తుంటారు. టాలీవుడ్ మేకర్స్ ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ ను పరిచయం చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలా ఈ మధ్య కాలంలో కూడా చాలామంది కొత్త హీరోయిన్స్ పరిచయమయ్యారు. అతుల్య రవి .. ఆషిక రంగనాథ్ .. రెబా మోనికా జాన్ .. అనిక సురేంద్రన్ .. సాక్షి వైద్య వంటి హీరోయిన్స్ అలా వచ్చినవారే.తాజాగా ఆ జాబితాలో మరో కొత్త హీరోయిన్ చేరిపోయింది. ఆ బ్యూటీ పేరే ‘యుక్తి తరేజా’.

‘హర్యాన’కి చెందిన పంజాబీ ఫ్యామిలీ నుంచి యుక్తి తరేజా వచ్చింది. మోడలింగ్ లో మంచి అనుభవం ఉన్న ఈ సుందరి. రీసెంట్ గా వచ్చిన ‘రంగబలి’ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది. నాగశౌర్య సరసన అందంగా మెరిసింది. డీసెంట్ లుక్స్ తోను .. హాట్ లుక్స్ తోను యుక్తి ఆకట్టుకుంది. యాక్టింగ్ పరంగా కూడా మరీ అంత వీక్ గా అయితే ఏమీ లేదు. మోడల్ కనుక మంచి ఫిట్ నెస్ తో .. నాజూకైన రూపంతో యూత్ మనసులను కొల్లగొట్టింది.

అయితే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో థియేటర్స్ నుంచి రెస్పాన్స్ రావడం లేదు. నాగశౌర్య నుంచి గతంలో వచ్చిన సినిమాలు అందుకు కారణం కావొచ్చు. లేదంటే ఇదేదో డబ్బింగ్ సినిమా టైటిల్ మాదిరిగా అనిపించి ఉండొచ్చు. కానీ నిజానికి ఈ సినిమాలోని కంటెంట్ అంత తీసి పారేయదగినదేం కాదు. లవ్ తో పాటు కామెడీని .. ఎమోషన్స్ ను కలిపి నడిపించారు. యుక్తి పాత్ర కూడా ఇంటర్వెల్ వరకూ తెరపై బాగానే కనిపిస్తుంది. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీకి, ఓ మాదిరి బడ్జెట్ సినిమాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్