తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు ఓ కీలక మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా తునిలో సాగుతోన్న ఈ యాత్ర నేడు 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా తుని నియోజకవర్గం తేటగుంట హైవేలో యనమల గెస్ట్ హౌస్ వద్ద పైలాన్ ను లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ భార్య నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, బావమరిది నందమూరి మోక్షజ్ఞ, తోడల్లుడు భరత్ తదితరులు పాల్గొన్నారు. లోకేష్ కి సంఘీభావం తెలిపేందుకు పెద్దఎత్తున టిడిపి నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.


ప్రతి పైలాన్ ఆవిష్కరణ సందర్భంగా ఒక్కో హామీ ఇస్తోన్న లోకేష్… 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న తరుణంలో జగన్ ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటిన్లు మళ్ళీ తెరిపిస్తామని శిలాఫలకంలో పేర్కొంటూ హామీ ఇచ్చారు.