Saturday, March 7, 2026
Homeసినిమాయువ సుధ ఆర్ట్స్ ఆఫీస్‌ ప్రారంభం

యువ సుధ ఆర్ట్స్ ఆఫీస్‌ ప్రారంభం

ప‌దిహేనేళ్ల‌కు పైగా ప‌లు విజ‌య‌వంతమైన చిత్రాల‌ను పంపిణీ చేసి డిస్ట్రిబ్యూట‌ర్  గా సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు మిక్కిలినేని సుధాక‌ర్‌. ఇప్పుడు ఆయ‌న భారీ బ‌డ్జెట్ చిత్రాల నిర్మాత‌గా మారుతున్నారు. అందులో భాగంగా యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ ఆఫీసు హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.ఈ వేడుకకు దిల్ రాజు, డీవీవీ దానయ్య, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు.

యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఆ హీరోయిన్ ఎవరు అనేది తెలియాల్సివుంది. ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఈ ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సింది కానీ.. ప్రస్తుతం సిటీలో లేని కారణంగా ఎన్టీఆర్ హాజరుకాలేదు. త్వరలోనే ఎన్టీఆర్ తో చేయనున్న మూవీకి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular