బీజేపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తనపై కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారని, తల్లి లాంటి తెరాస ను వీడే ప్రసక్తి లేదని జహీరాబాద్ ఎంపీ భీంరావు బసవంతరావు పాటిల్ తేల్చిచెప్పారు. తనపై వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. అది పూర్తిగా అవాస్తవం తనపై వస్తున్న దుష్ప్రచారలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పాటిల్ హెచ్చరించారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ప్రజా బలంతో తను రెండవసారి ఎంపీ అయ్యానని పాటిల్ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చెయ్యడమే తన లక్ష్యమన్నారు.
నారాయణ ఖేడ్ లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ బిబి పాటిల్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కనుకనే రైతు సమస్యలు తెలిసిన వ్యక్తిగా రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలు అమలు చేశారని పాటిల్ గుర్తు చేశారు.
జొన్నలు పండించిన రైతులు వచ్చిన పంటను ఎక్కడ అమ్మకం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్న అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడంతో వెంటనే స్పందించి జొన్నల కొనుగులు పై ప్రకటన విడుదల చేశారని పాటిల్ హర్షం వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతు పండించిన పంటను ప్రభుత్వ మే కొనుగులు చేయడం ఏ రాష్టంలో లేదని కేవలం మన రాష్టంలో ఉందన్నారు.