సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రిక ప్రపంచానికి తీరనిలోటని సిఎం అన్నారు. పత్రికా సంపాదకుడుగా తెలంగాణ ఉద్యమంలో అలీఖాన్ పోషించిన పాత్రను, వారి సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మీడియాలో గద్దర్ కు అత్యంత సన్నిహితుల్లో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ ఒకరు. గద్దర్ అంత్యక్రియలకు హాజరై ఎల్‌బి స్టేడియం నుండి పార్థివదేహంతో పాటే వాహనంలో ఆల్వాల్ ఇంటివద్దకు చేరుకున్నారు. అల్వాల్ లో గద్దర్ ఇంటి వద్ద నివాళులు అర్పించిన అలీఖాన్…తొక్కిసలాటలో కింద పడి పోయారు. ఊపిరిఆడక జహీరుద్దీన్ కు గుండెపోటు రావటంతో దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.