Blockbuster Success Meet: సుప్రీమ్ హీరో సాయితేజ్, విలక్షణ దర్శకుడు దేవ్ కట్టా కలయికలో రూపొందిన రిపబ్లిక్ సినిమా, అలాగే సంగీత్ శోభన్, సిమ్రాన్ జంటగా సీనియర్ నరేష్, తులసి, ‘గెటప్’ శీను ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ వెబ్ సిరీస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పతాకం పై మెగా డాటర్ నిహారికా కొణిదెల నిర్మించారు. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. ఈ రెండూ జీ`5 ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, దూసుకుపోతున్న సందర్భంగా ఈ ఆనందాన్ని పంచుకోవటానికి హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ పేరుతో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
నిహారిక మాట్లాడుతూ “కట్టా గారి విజన్ చాలా పెద్దది, గొప్పది. నాకు మంచి కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం చాలా ఇష్టం. అందులో భాగంగా భారీ కమర్షియల్ సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఫ్యూచర్‌లో ఉండొచ్చు. ప్రేక్షకురాలిగా ఎలాంటి సినిమాలు చూడాలని అనుకుంటానో.. అలాంటి సినిమాలే నిర్మించాలని చూస్తా. జీ వాళ్ల దృష్టిలో కంటెంట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అది నేను దగ్గరగా చూశాను. నేను చేసిన ‘ముద్దపప్పు ఆవకాయ’, నాన్నకూచి’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ మూడూ జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుండడం చాలా హ్యాపీగా ఉంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సింగిల్ థ్రెడ్ స్టోరీ. ఈ క్రెడిట్ మా డైరెక్టర్ మహేష్ గారు, రైటర్ మానస గారిదే. నాకు కథ చెప్పేటప్పుడే మహేష్ గారు నన్ను ఆ కథతో కనెక్ట్ చేసి నడిపించారు. ప్రతి సీన్ విషయంలో ఆయనకు చాలా క్లారిటీ ఉంది. రిపబ్లిక్ సినిమా చాలా హానెస్ట్ మూవీ. క్లైమాక్స్ నాకు అద్భుతంగా అనిపించింది” అన్నారు.
దేవాకట్టా మాట్లాడుతూ “నాకు కూడా ఫ్యామిలీ స్టోరీస్ చేయాలని ఉంది. నా దగ్గర 2,3 స్టోరీస్ ఉన్నాయి. వెన్నెల కూడా నేను అనుకున్న స్థాయిలో చేయలేదనిపిస్తుంది. వెన్నెల తర్వాత ప్రస్థానం కథ చెబితే కొందరు హీరోలు వెన్నెలకు కొద్దిగా యాక్షన్ కలిపి తీసుకురా అన్నారు. ప్రస్థానం తర్వాత అది తప్ప మరోటి ఊహించుకోలేకపోతున్నారు. ఒక్కొక్క దర్శకుడికి ఒక్కో బలం ఉంటుంది. దాన్ని ఎక్స్ పీరియన్స్ చేయడానికి హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటారు. ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుందని మేం ముందే ఊహించాం. సినిమా మీద మాకు ముందు నుంచి చాలా నమ్మకం ఉంది. గతంలో ఓ ప్రతిఘటన, ఓ రేపటిపౌరులు వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాం. కానీ గత 15, 20 సంవత్సరాలుగా ఆ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ను కోల్పోయాం. అది మనం చేసిన తప్పే. ప్రేక్షకులకు మనం సోషల్ రెస్పాన్సిబులిటీ ఉన్న కంటెంట్‌ను ఇస్తే తప్పకుండా ఆనందిస్తారు.. ఆదరిస్తారు. మా ‘రిపబ్లిక్’ ఓటీటీలో గ్రాండ్ సక్సెస్ కావటానికి ప్రధాన కారణం.. జీ5 వారు ప్రమోట్ చేసిన విధానమే అని కన్‌ఫర్మ్‌గా చెప్పగలను. ఆడియెన్స్ అంటే అందరూ మన మనసులోనే ఉంటారు. కాబట్టే మనం రాసే క్యారెక్టర్స్ వారికి కనెక్ట్ అవుతుంటాయి. రిపబ్లిక్ లోని ప్రతి మాట.. ప్రతి సన్నివేశం ప్రతి ఆడియెన్స్ చర్చించే విషయమే. ఈ కథ సమాజంలోని ఒక డీప్ డిస్టబెన్స్ నుంచి పుట్టింది కాబట్టే అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. నెక్ట్స్ ఏ ఎమోషన్‌తో సినిమా చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు” అన్నారు.