Tuesday, February 27, 2024
Homeతెలంగాణఈటెల మేకవన్నె పులి - మంత్రులు

ఈటెల మేకవన్నె పులి – మంత్రులు

ఈటెల రాజేందర్ కు ప్రభుత్వంలో, పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని, అసైన్డ్ భూములు ఆక్రమిచారని తేలినందునే చర్యలు తీసుకున్నారని తెలంగాణా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఈటెల రాజేందర్ చేస్తున్న విమర్శల రాష్ట్రమంత్రులు తీవ్రంగా ఖండించారు.
రాజేందర్ ఆత్మా గౌరవం ఎందుకు దెబ్బతిందో అర్ధం కావడం లేదని, గత కొంత కాలంగా రాజేందర్ పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఈశ్వర్ గుర్తు చేశారు. తెలంగాణాలో రైతులు సంతోషంగా వున్నారని, పార్టీతో లబ్ధిపొందిన ఈటెల ఇలాంటి వ్యాక్యాలు చేయడం సమంజసం కాదని ఈశ్వర్ హితవు పలికారు.

ఈటెల హుజురాబాద్ లో బిసి, హైదరాబాద్ లో ఓసి అని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. ఈటెల మేకవన్నె పులి అని, బిసి ముసుగులో వున్న పెద్ద డోరా అని విమర్శించారు. పదవి వున్నప్పుడు ఆయనకు బిసిలు గుర్తుకు రాలేదని, పదవి పోయిన తర్వాతే బిసి అని చెప్పుకుంటున్నారని, ముదిరాజ్ ళ సంక్షేమం కోసం అయన ఎప్పుడైనా మాట్లాడారా అని గంగుల ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్