-0.2 C
New York
Wednesday, November 29, 2023

Buy now

HomeTrending Newsకాగిత కన్నుమూత

కాగిత కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కృష్ణ జిల్లా పెడన మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అనారోగ్యంతో కన్నుమూశారు. గతంలో గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్న కాగిత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేటి సాయంత్రం మరణించారు. అయన వయస్సు 71 సంవత్సరాలు.

ఎమ్మెల్యే గా, చీఫ్ విప్ గా, రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా, టిటిడి ఛైర్మన్ గా కాగిత సేవలందించారు. మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి మూడుసార్లు, పెడన నుంచి ఒకసారి మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే మంత్రి కావాలన్న అయన కల నెరేవేరకుండానే మరణించారు.

అయన భౌతిక కాయాన్ని నేటి సాయంత్రం స్వగ్రామమైన నాగేశ్వర రావు పేట తరలించనున్నారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్