Friday, March 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్కోవిడ్ రోగులకు ఉచిత వైద్యం – సిఎం జగన్

కోవిడ్ రోగులకు ఉచిత వైద్యం – సిఎం జగన్

ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్‌ అయిన ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 50 శాతం బెడ్లు కోవిడ్ కు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా విధిగా చేర్చుకోవాలలని దానికి అనుగుణంగా బెడ్లు పెంచాలని సూచించారు. కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పరీక్షలు చేస్తున్నామని, ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలని, తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కోవిడ్‌ చికిత్స కోసం తీసుకున్న అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చికిత్స చేయాలని, ఇందులో ఎక్కడా తేడా రాకూడదని చెప్పారు.

ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో ఉన్న బెడ్లు ఎన్ని? వాటిలో ఎన్ని కోవిడ్‌ రోగులకు ఇస్తున్నారు? అనే దానిపై పూర్తి స్పష్టత ఉండాలన్నారు. 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ వస్తే, ఆ రోగి ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఆ జిల్లాకు మెసేజ్‌ వెళ్తుందని, వెంటనే కలెక్టర్, జిల్లా యంత్రాంగం స్పందించి, ఆయా ఆస్పత్రులలో రోగులను చేర్పించాలని సూచన చేశారు. ఏ ఆస్పత్రి కూడా రోగుల నుంచి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా చూడాలని, కోవిడ్‌ రోగులకు పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.

అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో శానిటేషన్, క్వాలిటీ ఫుడ్, డాక్టర్ల అందుబాటు, ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, ఆక్సీజన్‌.. ఈ 5 మనకు చాలా ముఖ్యమని సిఎం అన్నారు. వైద్యులు లేకపోతే వెంటనే తాత్కాలికంగా అయినా నియామకాలు చేయాలని అధికారులను ఆదేశించారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్