మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. జులై నుంచి ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడంతో ఆచార్య ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఓ పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత చిరంజీవి లూసిఫర్ రీమేక్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

దీనికి మోహన్ రాజా దర్శకుడు. ఆమధ్య ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే… చిరు పుట్టినరోజైన ఆగష్టు 22 నుంచి అని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే… మలయాళం వెర్సెన్ లో ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనది. ఆమె హీరోకి చెల్లి పాత్రను అద్భుతంగా పోషించారు. ఈ పాత్రను తెలుగులో నయనతార పోషించనున్నట్టు ప్రచారం జరిగింది. ఆతర్వాత సుహాసిని పేరు తెర పైకి వచ్చింది. ఇప్పుడు నయనతార, సుహాసిని కాకుండా… ఆ పాత్రను బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పోషించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తలు వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *