Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప. ఈ చిత్రానికి ఇంటిలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత బన్నీ – సుక్కు కలిసి చేస్తున్న సినిమా కావడంతో పుష్ప మూవీ పై ప్రారంభం నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఇటీవల పుష్ప టీజర్‌ రిలీజ్‌ చేసారు. అందులో బన్నీ లుక్‌ను చూసి ఫ్యాన్స్‌ షాకయ్యారు. పుష్పరాజ్‌గా చేతిలో గొడ్డలితో ఊర మాస్‌ లుక్‌లో కనిపించి అభిమానులతో ఈలలు వేయించాడు బన్నీ. ఇక రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అదిరింది.

తాజాగా ఈ టీజర్‌ యూట్యూబ్‌లో 60 మిలియన్ల వ్యూస్‌ను అందుకోగా 1.3 మిలియన్‌ లైక్స్‌ను సంపాదించింది. అత్యంత తక్కువ సమయంలోనే 60 మిలియన్ల వ్యూస్‌ మార్క్‌ను చేరుకున్న తెలుగు టీజర్‌గా పుష్ప రికార్డుకెక్కింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్న పుష్ప మూవీలో క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్నా పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది. మలయాళ ఆర్టిస్ట్ ఫహద్ ఫజల్ విలన్‌గా కనిపించనున్నాడు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

యాంకర్ టర్నడ్ యాక్ట్రస్ అనసూయ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంది. అయితే.. అల్లు అర్జున్ కి కరోనా రావడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ భారీ, క్రేజీ మూవీని ఆగష్టు 13న పుష్ప మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. మరి.. అనుకున్నట్టుగా పుష్ప మూవీ ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు వస్తుందా..? లేక వాయిదా పడుతుందా..? అనేది తెలియాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com