2.6 C
New York
Thursday, November 30, 2023

Buy now

HomeTrending Newsమరోసారి మహేష్‌ -త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్

మరోసారి మహేష్‌ -త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా చిత్రాలు రూపొందాయి. ఈ రెండు చిత్రాలు వెండితెర మీద ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయినా.. బుల్లితెర మీద మాత్రం ఆశించిన దానికంటే… అంతకు మించి అనేలా ఆదరణ పొందడంలో విజయం సాధించాయి. అతడు, ఖలేజా చిత్రాలు కమర్షియల్ సక్సస్ సాధించకపోయినా.. మహేష్‌, త్రివిక్రమ్ ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చాయి. వీరిద్దరి మధ్య మంచి అనుబంధాన్ని ఏర్పరిచాయి. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎదురూ చూస్తూనే ఉన్నారు.

ఇప్పటికి ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ సెట్ అయ్యింది. మహేష్‌ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీని ఈరోజు (శనివారం) అఫిషియల్ గా ఎనౌన్స్ చేసారు. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. అతడు సినిమా 2005లో వచ్చింది. ఖలేజా సినిమా 2010లో వచ్చింది. ఇప్పుడు 11 సంవత్సరాల గ్యాప్ తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ వస్తుండడం విశేషం. ఈ క్రేజీ మూవీ షూటింగ్ ను త్వరలో ప్రారంభించనున్నారు. 2022 సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టుగా అఫిషియల్ గా ప్రకటించారు.  అతడు, ఖలేజా చిత్రాలతో ఆశించిన మేరకు మెప్పించలేపోయిన ఈ కాంబినేషన్ ఈసారి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్