మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత హెచ్ ఏ రెహ్మాన్ గుండెపోటుతో మరణించారు. ఈ రోజు మధ్యాహ్నం విరామం తీసుకుంటున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.
గతంలో కేసీయార్ కు సన్నిహితుడిగా పేరుపొందిన రెహ్మాన్ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెహ్మాన్ మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.