సబ్బం హరి కన్నుమూత

మాజీ ఎంపి, తెలుగుదేశం పార్టీ నేత సబ్బం హరి కన్నుమూశారు. ఏప్రిల్ 15 నుంచి కరోనాతో బాధపడుతున్న సబ్బం హరి నాలుగు రోజులపాటు హోం ఐసోలేషన్ లో వుండి చికిత్స పొందారు.. పరిస్థితిలో మార్పు లేకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అరిలోవా అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ ద్వారా చికిత్స పొందుతున్నారు. కొద్ది సేపటి క్రితం  సబ్బం హరి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

విశాఖపట్నం మేయర్ గా, అనకాపల్లి ఎంపిగా సబ్బం సేవలందించారు. మొదట్లో వైఎస్ జగన్ కు సన్నిహితునిగా పేరుపొందిన సబ్బం ఆ తర్వాత జగన్ తో విభేదించి దూరమయ్యారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టిలో చేరి భీమిలి నుంచి పోటి చేసి ఓడిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *