కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వాక్సిన్ డ్రైవ్ విజయవంతంగా గా నడుస్తోంది.
ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ శంకర్ మాట్లాడుతూ.. “చిరంజీవి గారి చేతుల మీదుగా ఇటీవలే వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. ఇప్పటి వరకు 4000 మందికి పైగా వాక్సిన్ తీసుకున్నారు. సినిమా కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఫెడరేషన్ సభ్యులు, సినీ పాత్రికేయులకు కూడా వాక్సిన్ ఇస్తున్నాం. అలాగే, మిగతా సినిమా రంగానికి చెడిన అందరూ దయచేసి వాక్సిన్ తీసుకోడానికి ముందుకు రావాలి. అప్పుడే షూటింగ్స్ తొందరగా స్టార్ట్ అవుతాయి. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు” అని తెలియజేశారు.

తెలుగు, జర్నలిజం, పాలిటిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లు. ప్రింట్, టీవీ మీడియాల్లో 17 ఏళ్లు పాటు సినిమా జర్నలిస్టుగా అనుభవం. వివిధ సినీ వార పత్రికలు, దిన పత్రిక, ఎలెక్ట్రానిక్ మీడియాలో, వెబ్ సైట్ లో వర్క్ చేసిన అనుభవం.