Friday, March 29, 2024
Homeతెలంగాణసెకండ్ డోస్ ఓన్లీ

సెకండ్ డోస్ ఓన్లీ

తెలంగాణలో మొదటి డోసు వ్యాక్సిన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  రేపటి నుంచి సెకండ్ డోసు వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ నెల 15 వరకు మొదటిరోజు ఆపేస్తున్నామని ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.ఈ నెలాఖరుకి రెండో డోసు తీసుకోవాల్సిన వారు రాష్ట్రంలో 19 లక్షల మంది ఉన్నారని, వారికి ప్రాధాన్యత ఇచ్చిన తరువాతే కొత్తవారికి మొదటి డోసు ఇస్తామని చెప్పారు.

రాష్ట్రంలో 23 వేల బెడ్స్ అందుబాటులో వున్నాయని, ఎవరూ అనవసరంగా మందులు వేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిహెచ్ఎంసి పరిధిలో ఫీవర్ సర్వే  మొదలుపెట్టమని, లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్ అందిస్తున్నామని, అవసరం లేని వారు కూడా మందులు ఇవ్వాల్సిందిగా సిబ్బందిని అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అవసరం లేకుండా మందులు తీసుకోవద్దని కోరారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్, బెడ్ల లభ్యతపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.  తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ ను మరో వారంరోజులపాటు పొడిగించారు. ఈ నెల 15వ తేదీవరకు కర్ఫ్యూ అమల్లో వుంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్