Sunday, October 1, 2023
Homeసినిమాస్టైలీష్ మూవీ మేకర్.. గుణశేఖర్.

స్టైలీష్ మూవీ మేకర్.. గుణశేఖర్.

సినిమాపై ఉన్న ప్యాషన్‌తో తను చేసే ప్రతి సినిమాను అద్భుతంగా మలుస్తూ ఇప్పుడు పాన్‌ ఇండియా చిత్రాలతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేయడానికి సిద్ధమవుతోన్న అన్‌కాం ప్రమైజ్డ్‌ స్టైలిష్‌ మూవీ మేకర్‌ గుణశేఖర్‌. జూన్‌ 2 ఆయన  పుట్టినరోజు. ఈ సందర్భంగా గుణశేఖర్‌ గురించి క్లుప్తంగా మీ కోసం.. ఓ వైపు భారీతనం, డిఫరెంట్‌ కథ, కథనం.. వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేసి ప్రేక్షకులు ఊహించిన దాని కంటే మరో మెట్టు పైనే సినిమాలను రూపొందించిన స్టైలిష్‌ మూవీ మేకర్‌. తొలి చిత్రం ‘లాఠీ’ నుంచి ‘రుద్రమదేవి’ వరకు గుణశేఖర్‌ మేకింగ్‌ స్టైలే వేరు. అదే ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. తొలి చిత్రం ‘లాఠీ’ మూడు నంది అవార్డులను సొంతం చేసుకోవడంతో గుణశేఖర్‌ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ తర్వాత ‘సొగసుచూడతరమా’ అనే సెన్సిబుల్‌ మూవీతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిం కేటగిరీలో మరోసారి నంది అవార్డును దక్కించుకుంది. ఇక మూడో చిత్రం ‘బాలరామాయణం’. నేటి తరం అగ్ర కథానాయకుల్లో ఒకరైన తారక్‌ను బాలనటుడిగా నటించిన తొలి చిత్రమిది. ఈ సినిమా బెస్ట్‌ చిల్డ్రన్‌ ఫిలిం కేటగిరీలో జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది. ఇలా మూడు చిత్రాలతో దర్శకుడి గా తన మార్క్‌ క్రియేట్‌ చేసుకు న్నారు గుణశేఖర్‌.

మెగాస్టార్‌తో…
మెగాస్టార్‌ చిరంజీవితో ‘చూడాలని ఉంది’ సినిమా చేసే అవకాశం దక్కించుకున్న గుణశేఖర్‌, చిరంజీవిని సరికొత్త కోణంలో ప్రెజంట్‌ చేశారు. ఈ సినిమా పాటలు పెద్ద సెన్సేషన్‌ను క్రియేట్‌ చేశాయి. అలాగే ఈ సినిమా కోసం వేసిన కోల్‌కతా సెట్ అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే వీరిద్దరి కలయికలో రూపొందిన ‘మృగరాజు’ ప్రేక్ష‌కుల‌కు ఒక సరికొత్త అనుభూతినిచ్చింది. జగపతిబాబు, లయ ప్రధాన పాత్రల్లో రూపొందించిన ‘మనోహరం’ కూడా  మంచి హిట్‌ మూవీగా పేరు తెచ్చుకుంది.


ఒక్కడుతో సెన్సేషన్‌…
సూపర్‌స్టార్‌ మహేశ్‌తో మూడు సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా గుణశేఖర్‌కి ఓ రికార్డ్‌ ఉంది. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ‘ఒక్కడు’ సినిమా గురించి. కబడ్డీ ప్లేయర్‌గా, పాత బస్తీ కుర్రాడిగా మహేశ్‌ను గుణశేఖర్ పోట్రేట్‌ చేసిన తీరు సింప్లీ సూపర్బ్ అనే తీరాలి. ఈ సినిమాతో మహేశ్‌ మాస్‌ ఆడియెన్స్ కు మ‌రింత‌ దగ్గరయ్యారు. ఈ సినిమా కోసం గుణశేఖర్‌ వేయించిన చార్మినార్‌ సెట్‌ ఇప్పటికీ వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ సెట్‌గా చెప్పుకుంటారంటే అతిశయోక్తి కాదు. తర్వాత ‘అర్జున్‌’ సినిమాతో మహేశ్‌ను ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గర చేశారు గుణశేఖర్‌. ఈ లావిష్‌ మేకర్‌తో మహేశ్‌ చేసిన మూడో చిత్రం ‘సైనికుడు’. ఈ సినిమాతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు గుణశేఖర్‌.


రుద్రమదేవితో సంచలనం
సినిమా అంటే లార్జర్‌ దేన్‌ లైఫ్‌ అని నమ్మే దర్శకుడు గుణశేఖర్‌. తెలుగు ప్రాభవాన్ని చాటి చెప్పిన కాకతీయ వీరనారి రాణీ రుద్రమ దేవి జీవిత కథను ఆధారంగా చేసుకుని ‘రుద్రమదేవి’ అనే సినిమాను నిర్మించారు. తెలుగులో రూపొందిన తొలి హిస్టారికల్‌ స్టీరియో స్కోపిక్‌ త్రీడీ మూవీ ఇది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా అనుష్క రేంజ్‌ను నెక్స్‌ట్‌ లెవల్‌కు తీసుకెళ్లింది. గుణశేఖర్‌ కోసం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఈ చిత్రంలో గోన గన్నారెడ్డిగా నటించారు. ఇక రానా, నిత్యామీనన్‌, కెథరిన్‌ ఇలా భారీ తారాగణంతో సినిమా తెర‌కెక్కించి  సంచలన విజయాన్ని సాధించారు.

ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో హిరణ్య
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలుస్తున్న నేటి తరుణంలో గుణశేఖర్‌ అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్‌, టెక్నాలజీతో, భారీ బడ్జెట్‌తో ‘హిరణ్య’ అనే పౌరాణిక చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. పాన్‌ వరల్డ్‌ రేంజ్‌లో రూపొందించేలా గుణశేఖర్‌ ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు.

ఆహ్లాదకరమైన  దృశ్య కావ్యంగా శాకుంతలం
తెలుగు సినిమా పరిశ్రమలో పౌరాణిక, కమర్షియల్‌ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ ఆదిపర్వంలోని ఆహ్లాదకరమైన ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శాకుంతలం’. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో డిఆర్‌పి-గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై గుణశేఖర్‌ కుమార్తె నీలిమ గుణ  నిర్మిస్తున్నారు. స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని శకుంతలగా టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్‌ మోహన్‌ దుష్యంతుడుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాను గుణశేఖర్‌ ఎలాంటి రాజీ లేకుండా కనుల విందుగా రూపొందిస్తున్నారు.

Veerni Srinivasa Rao
Veerni Srinivasa Rao
తెలుగు, జర్నలిజం, పాలిటిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లు. ప్రింట్, టీవీ మీడియాల్లో 17 ఏళ్లు పాటు సినిమా జర్నలిస్టుగా అనుభవం. వివిధ సినీ వార పత్రికలు, దిన పత్రిక, ఎలెక్ట్రానిక్ మీడియాలో, వెబ్ సైట్ లో వర్క్ చేసిన అనుభవం.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న