Sunday, January 19, 2025
HomeTrending Newsఅచ్చే దిన్ పేరుతో అమ్మకాలు

అచ్చే దిన్ పేరుతో అమ్మకాలు

మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మోదీ తెస్తానన్న అచ్చే దిన్ అంటే, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడము, తాకట్టు పెట్టడమేనా అని ప్రశ్నించారు. నేడు ప్రభుత్వ రంగ సంస్థల్లో 35లక్షల మంది పనిచేస్తూన్నారని, మోడీ ఒక్కో రంగాన్ని ఖతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ వచ్చిన మల్లికార్జున ఖర్గే కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

రిజర్వేషన్లను సైతం నిర్వీర్యం చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలతో 3లక్షల 25వేల కోట్లు ప్రభుత్వానికి లాభాలు వస్తున్నాయని మల్లికార్జున ఖర్గే తెలిపారు. నష్టాలు చాలా తక్కువగా ఉన్నా, జాతీయ రహదారులను 404 రైల్వే స్టేషన్ లు, 101 రైళ్లను ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. 6000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అమ్మేస్తున్నారు. ఆర్థికవృద్ది రేటు పెరగడానికి ప్రభుత్వ రంగ సంస్థలే కారణమని, 70ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేయకపోతే మీరు అమ్ముతున్న ఆస్తులు ఎక్కడివని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.

 

నాగార్జున సాగర్, ఆల్మట్టిని కూడా అమ్మేస్తారని, ఒక్క రైల్వే లోనే నేను మంత్రిగా ఉన్నప్పుడు 14లక్షల మంది పనిచేసే వారని, నేడు ఆ సంఖ్య 12లక్షలకు తగ్గిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మోడీ చర్యలను అడ్డుకుంటుందని, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుందన్నారు. నిజమని నమ్మించడానికి మోడీ ఒకే అబద్దాన్ని వంద సార్లు చెబుతారని మల్లికార్జున ఖర్గే చెప్పారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్