Saturday, January 18, 2025
Homeజాతీయంఆస్పత్రిలో చేరిన విజయకాంత్

ఆస్పత్రిలో చేరిన విజయకాంత్

తమిళ నటుడు, రాజకీయ నేత విజయకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.  శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతున్న అయన్ను నేటి  తెల్లవారుజామున చెన్నై లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డాక్టర్ల బృందం అయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోంది.

గత రెండు సంవత్సరాలుగా విజయకాంత్ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అయన క్రియాశీలకంగా వ్యవహరించలేక పోయారు. విజయకాంత్ భార్య ప్రేమలత అసెంబ్లీకి పోటి చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు.  విజయకాంత్ గత ఏడాది కోవిడ్ బారిన పడి కోలుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్