Saturday, March 14, 2026
HomeTrending Newsఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. మాసబ్ ట్యాంక్, దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గుస్సాడి, దింస నృత్యాలతో, వివిధ కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా  గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీల అభ్యున్నతి కోసం పనిచేసిన వారిని సన్మానించారు. 10 మంది గిరిజన పారిశ్రామిక వేత్తలకు సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యుర్ షిప్ పథకం కింద 4.4 కోట్ల చెక్ ను మంత్రి అందించారు.  అటవీ నుంచి నాణ్యమైన తేనె ను ఉత్పత్తి చేసే వారికి 90 లక్షల విలువైన తేనె సేకరణ ఉపకరణాలు అందించారు. ఆదివాసీ మూలికా వైద్య విశిష్టత తెలిపే పుస్తకం, గోండు పద కోశం, పచ్చబొట్ల వైద్యం, ఆదివాసీల ఆహార, సంప్రదాయాలు తెలిపే పుస్తకాలు ఆవిష్కరించారు.

గురుకులాల్లో చదువుతూ దేశంలో ప్రముఖ ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన 183 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించడంలో భాగంగా వేదిక మీద నేడు 10 మంది ఆదివాసీ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరజ్, పద్మశ్రీ గుస్సాడి కనకరాజు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి శ్రీమతి డాక్టర్ క్రిస్టినా, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, నవీన్ నికోలస్, సంయుక్త సంచాలకులు సముజ్వల, కళ్యాణ్ రెడ్డి, విజయలక్ష్మి, లక్ష్మి ప్రసాద్, గిరిజన మ్యూజియం కూరేటర్ డాక్టర్ సత్యనారాయణ, జి. సీ. సి మేనేజింగ్ డైరెక్టర్ సీతారాం నాయక్,  చీఫ్ ఇంజనీర్ శంకర్,  ఇతర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular