Tuesday, April 16, 2024
HomeTrending Newsకశ్మిరీలపై కేంద్రం కక్ష సాధింపు

కశ్మిరీలపై కేంద్రం కక్ష సాధింపు

కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ లో కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. నేషనల్ ఇన్వెస్టిగేటివ్  ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ)ని అడ్డం పెట్టుకొని కశ్మీర్ నేతలను  వేధిస్తున్నారని ముఫ్తీ మండిపడ్డారు. విచారణ సంస్థలతో సోదాలు చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

కశ్మీర్ విభజన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం విచారణల పేరుతో అమాయకులను వేధిస్తూ, జైళ్లలో నిర్భందిస్తున్నారని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.

జమ్మూకశ్మీర్ లో ఆదివారం 14 జిల్లాల్లో 56  ప్రాంతాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు నిర్వహించింది. విరాళాల రూపంలో వచ్చిన సొమ్మును జమాత్ ఏ ఇస్లామి సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతోందని ఆరోపణలు ఉన్నాయి. జమాత్ ఏ ఇస్లామి నేతల ఇళ్ళపై ఏకకాలంలో దాడులు చేశారు. వేర్పాటువాద బావజాలం ప్రోత్సహిస్తోందని జమాత్ ఏ ఇస్లామి సంస్థపై 2019 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నిషేధం ఉన్నా సంస్థ కార్యకలాపాలు చాప కింద నీరులా కొనసాగుతున్నాయని కేంద్ర హోం శాఖ వర్గాలు ఇటీవల నివేదికలు అందాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్