Friday, April 19, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్జగనన్న విద్యాదీవెన నగదు జమ చేసిన సీఎం జగన్

జగనన్న విద్యాదీవెన నగదు జమ చేసిన సీఎం జగన్

చదువుతోనే మన రూపురేఖలు మారుతాయి
విద్యా దీవెన ద్వారా 10.88లక్షల మంది పిల్లలకు లబ్ధి
పిల్లల ప్రతి అడుగులో ప్రభుత్వం తోడుగా ఉంది
‘విద్యాదీవెన’ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌
ఆన్‌లైన్ ద్వారా తల్లుల ఖాతాల్లో ‘జగనన్న విద్యాదీవెన’ నగదు జమ చేసిన సీఎం
అమరావతి: పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏప్రిల్‌లో విద్యాదీవెన మొదటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని.. 14న అంబేడ్కర్‌ జయంతి ఘనంగా జరుపుకున్నామన్నారు. ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొదటి విడత నగదును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్