Thursday, April 25, 2024
Homeతెలంగాణటిఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి డా"వి.శ్రీనివాస్ గౌడ్ గారు

టిఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి డా”వి.శ్రీనివాస్ గౌడ్ గారు

టిఆర్ఎస్ పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవం ను మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మహబూబ్ పట్టణంలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల,పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరై ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అదేశాల మేరకు కరోనా నిబంధనలను పాటిస్తూ జెండా ఆవిష్కరించడం జరిగిందన్నారు. తెలంగాణ సాధనలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తెలంగాణ సాధనకు కృషిచేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్టంలో మంత్రి గా ఉండి తెలంగాణ వనరులను దోసుకుపోతున్న ఆంధ్ర పాలకులను వ్యతిరేకించి తెలంగాణ సాధనకు కృషి చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. ఫ్రొ. జయ శంకర్ ఆశయ సాధన కోసం నిరంతరం పని చేస్తున్న పార్టీ టిఆర్ఎస్ ఒకటే అని అన్నారు. ఉమ్మడి జిల్లాలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయితే మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా లో ఉన్న ప్రతి చెరువును కృష్ణా నది నీటితో నింపుతామన్నారు. రాబోయే 5 సంవత్సరాలలో మహబూబ్ నగర్ ఒక మహా నగరంగా మారనుందన్నారు…..

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారు, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు గారు, డిసిసిబి వైస్ చైర్మన్ కె.వెంకటయ్య గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్ గారు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు చేరుకుపల్లి రాజేశ్వర్ గారు, కాడం ఆంజనేయులు గారు, మహాబూబ్ నగర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారు,హన్వాడ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్ గారు కౌన్సిలర్ లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్