తిరుపతి సభలో చంద్రబాబు పెద్ద డ్రామాను çసృష్టించాడుతనపై రాళ్ళ వర్షం కురిసిందంటూ నాటకాలు ఆడాడు ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్ళ డ్రామా
పధకం ప్రకారం గవర్నర్ అపాయింట్‌మెంట్. సీఈసీని కలిసే ప్రయత్నం చంద్రబాబుపై రాళ్ళు రువ్వే అవసరం మాకు లేదు పారా మిలటరీ బలగాలు రావాలని చంద్రబాబు ఎలా డిమాండ్ చేస్తాడు? రేపు కేంద్ర బలగాలు రాలేదని ఎన్నికల నుంచి తప్పుకుంటాడేమో? తెలుగుదేశం పరిస్థితి అయిపోయిందని అచ్చెన్నాయుడే చెబుతున్నాడు ఈ రాష్ట్రానికి బిజెపి ఏం చేసిందని ఓట్లు అడుగుతున్నారు? ప్రత్యేక హోదా నుంచి పోలవరం వరకు ప్రతి దానిలోనూ కేంద్రం నిర్లక్ష్యం
ప్రెస్‌మీట్‌లో శ్రీ అంబటి రాంబాబు స్పష్టీకరణ:
రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడుగా వున్న అచ్చెన్నాయుడు తాజాగా తన పార్టీకి చెందిన వ్యక్తితో మాట్లాడిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈనెల 17తో టిడిపి పరిస్థితి అయిపోయిందని అచ్చెన్నాయుడు స్వయంగా ఆ వీడియోలో చెబుతున్నాడు. తిరుపతి ఎన్నికల సందర్బంగా అంతర్గత సర్వేల్లోనే టిడిపికి 25 శాతం కన్నా తక్కువ ఓట్లు వస్తాయని నివేదికలు వస్తున్నాయి. అవమానకరమైన ఓటమి టిడిపికి తప్పదనే రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే క్రమంలో వైయస్‌ఆర్‌సిపి గత మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి.