Saturday, January 18, 2025
HomeTrending Newsదసరాకు మారిన ‘పుష్ప’?

దసరాకు మారిన ‘పుష్ప’?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – ఇంటిలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ, సుక్కు కలిసి చేస్తున్న సినిమా కావడంతో పుష్ప సినిమా పై అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు పుష్ప అప్ డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ఆగష్టు 13న రిలీజ్ చేయనున్నట్టుగా గతంలో ప్రకటించారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోను ఎనౌన్స్ చేసినట్టుగా ఆగష్టు 13నే రిలీజ్ చేయాలని సుకుమార్ కరోనా టైమ్ లో కూడా షూటింగ్ చేసారు. అయితే.. బన్నీకి కరోనా రావడంతో ఇప్పుడు పుష్ప షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో పుష్ప అనుకున్న టైమ్ కి ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే అని.. ఈ సినిమా విడుదల వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి. మరి.. ఆగష్టు 13న పుష్ప రాకపోతే ఎప్పుడు వస్తుందంటే… దసరాకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

దసరాకి రావాల్సిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ ఎలాగూ వాయిదా పడడం ఖాయం. అందుచేత ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేయాలనుకున్న టైమ్ లో పుష్ప ప్రేక్షకుల ముందుకు రానుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి.. పుష్ప రిలీజ్ డేట్ గురించి త్వరలోనే అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్