Thursday, November 21, 2024
Homeతెలంగాణదేశానికే తెలంగాణ ఆదర్శం

దేశానికే తెలంగాణ ఆదర్శం

ఆక్సిజన్ తరలింపుకు విమాన సేవల వినియోగం
విమానల ద్వారా తరలిస్తున్న తొలి రాష్ట్రం
హైద్రాబాద్ నుంచి ఒరిస్సాకు ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన విమానాలు
3 రోజుల సమయం ఆదాతో పాటు ఆక్సిజన్ అత్యవసరంగా ఉన్న రోగులకు అందనున్న ప్రాణవాయువు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్కి, అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీ కేటీఆర్
మూడునాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను వినియోగిస్తున్నారు. అయినా సరిపోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తిమేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 360 మెట్రిక్‌టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించింది. కేంద్రం కేటాయిస్తామని చెప్పిన దాంట్లో 70 టన్నుల వరకు మన రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చిన్నచిన్న ఆక్సిజన్‌ ప్లాంట్ల నుంచి ఉన్నా యి. మిగిలిన ఆక్సిజన్‌ను బళ్లారి, భిలాయ్‌, అంగుల్‌ (ఒడిశా), పెరంబుదూర్‌ నుంచి తీసుకోవాలని సూచించింది. తెలంగాణకు అత్యంత సమీపంలోని బళ్లారి స్టీల్‌ప్లాంట్‌ నుంచి తెలంగాణకు కేటాయించింది 20 మెట్రిక్‌ టన్నులే. వైజాగ్‌నుంచి దాదాపు ఇంతే కేటాయించారు. భిలాయ్‌, పెరంబుదూర్‌, అంగుల్‌ నుంచి ఆక్సిజన్‌ తెచ్చుకోవడం తేలికేమీ కాదు. అవన్నీ దూరంగా ఉన్న ప్లాంట్లు. ఆయా ప్రాంతాలనుంచి ఆక్సిజన్‌ రావడానికి కనీసం మూడు రోజులు పడుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమాన సేవలను వినియోగించుకుంటుంది రాష్ట్రం..

RELATED ARTICLES

Most Popular

న్యూస్