రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో వున్న నైట్ కర్ఫ్యూను మే 8వ తేదీ వరకూ పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో వుంది. కర్ఫ్యూ తొలుత ఏప్రిల్ 20 నుంచి 30వ తేదీ వరకు అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ఆ గడువు నేటితో ముగియనుండటంతో మరో వారంపాటు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా, కరోనా విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిగా లేవని అభిప్రాయపడింది. నైట్ కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేక మమ్మల్నే ఆదేశాలు ఇవ్వమంటారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఏ విషయమూ 45 నిమిషాల్లో వెల్లడించాలని ఆదేశించింది.
న్యాయస్థానం ఆదేశాలతో ప్రభుత్వం కర్ఫ్యూ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకుంది.