రాష్ట్రంలో ఇంటర్మీడియెట్, 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఏపీ హైకోర్టు సూచించింది. పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిపింది.
పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, కోవిడ్ తో బాధపడే విద్యార్థులు పరీక్షా రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఏపి ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరణ ఇచ్చారు.
పరీక్షల నిర్వహణలో అనేక అంశాలు జముడిపడి వుంటాయని, ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేసిన అంశాన్ని, రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ కేసులను ప్రభుత్వం పరిగణన లోకి తీసుకోవాలని న్యాయస్థానం చెప్పింది.
తదుపరి విచారణ మే 3 వ తేదీ నాటికి వాయిదా వేసిన హైకోర్టు, ప్రభుత్వం తన అభిప్రాయాన్నిఅదేరోజు వెల్లడించాలని ఆదేశించింది.