Saturday, March 15, 2025
HomeTrending NewsPakistan: ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో అట్టుడుకుతున్న పాకిస్థాన్

Pakistan: ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో అట్టుడుకుతున్న పాకిస్థాన్

తన భార్య బుషారా బీబీకి చెందిన అల్‌ ఖదీర్‌ అనే ట్రస్ట్‌కు రూ.53 కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా బదలాయింపు చేశారన్న కేసులో పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ అవినీతి కేసు విచారణ నిమిత్తం మంగళవారం ఇస్లామాబాద్‌ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ను పారామిలటరీ రేంజర్స్‌ (NAB) కోర్టు ఆవరణ నుంచి బలవంతంగా లాక్కెళ్లి మరీ అరెస్టు చేశారు. దీంతో ఇమ్రాన్‌ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు పలుచోట్ల పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేశారు. పెషావర్‌లోని పాకిస్థాన్‌ రేడియో భవనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు.

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టుతో పాకిస్థాన్‌ అట్టుడికిపోతున్నది. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. పలుచోట్ల వాహనాలకు నిప్పుపెట్టడంతోపాటు ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఉన్న తమ పౌరులు, రాయబార సిబ్బంది అమెరికా, యునైటెడ్‌ కింగ్ డమ్‌, కెనడాలు హెచ్చరికలు జారీచేశాయి. జరభద్రంగా ఉండాలంటూ ఆదేశాలు జారీచేశాయి. జనసమ్మర్థం ఉంటే ప్రాంతాలకు వెళ్లకూడదని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలని తెలిపాయి.

పాకిస్థాన్‌లోని తమ పౌరులకు యూఎస్‌ ఎంబసీ ట్రావెల్‌ అలర్ట్‌ జారీచేసింది. ఇస్లామాబాద్‌లో నిరసనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించిన నివేదికలను రాయబార కార్యాలయం పరిశీలిస్తున్నదని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎంబసీకి సంబంధించి అన్నిరకాల అపాయింట్‌మెంట్లను రద్దుచేశామని పేర్కొన్నది. అత్యంత జాగరూకతతో ఉండాలని, రద్దీ ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదని సూచించింది. పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, దీనికోసం స్థానిక వార్తలను చూస్తూ ఉండాలని కోరింది. అత్యవసరమైతే తప్ప ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకూడదని చెప్పింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్