Saturday, February 22, 2025
HomeTrending Newsపుట్టా మధు అరెస్ట్!

పుట్టా మధు అరెస్ట్!

పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్టా మధును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మధును రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు రామగుండం తరలించి కమిషనరేట్ కార్యాలయంలో విచారిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జస్టిస్ వామనరావు దంపతుల హత్య కేసులో పుట్టా మధును విచారిస్తున్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో మధు సన్నిహితంగా మెలిగేవారు. ఈటలపై భూకబ్జా ఆరోపణలు, మంత్రివర్గం నుంచి ఉద్వాసన పరిణామాల తర్వాత మధు అజ్ఞాతంలోకి వెళ్ళారు. తన భర్త ఆచూకీ కనుగొనాలని మధు భార్య శైలజ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయమై రెండ్రోజులుగా మధు కుటుంబ సభ్యులు మంత్రి ప్రశాంత్ రెడ్డి ద్వారా సిఎం కెసిఆర్ ను కలుసుకునేదుకు ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్