Monday, March 31, 2025
Homeతెలంగాణప్రగతి భవన్ కి కెసిఆర్

ప్రగతి భవన్ కి కెసిఆర్

ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ చేరుకునున్నారు. ఏప్రిల్ 19న కెసిఆర్ కరోనా బారిన పడ్డారు. అప్పటినుంచి ఫాం హౌస్ లోనే వుండి చికిత్స తీసుకుంటున్నారు. మధ్యలో ఒకసారి వైద్య పరీక్షల కోసం నగరంలోని యశోదా హాస్పిటల్ వచ్చిన కెసిఆర్ పరీక్షల అనంతరం ఆస్పత్రి నుంచి నేరుగా ఫాం హౌస్ కే వెళ్ళిపోయారు. గత వారం జరిపిన కరోనా పరీక్షల్లో ముఖ్యమంత్రికి నెగెటివ్ వచ్చింది.

ముఖ్యమంత్రి ఈ సాయంత్రం కరోనా తీవ్రత పై అధికారులతో సమీక్ష నిర్వహించే  అవకాశం వుంది. ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్