Friday, May 31, 2024
Homeజాతీయంకేంద్రమంత్రి కాన్వాయ్ పై దాడి

కేంద్రమంత్రి కాన్వాయ్ పై దాడి

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం  మొదలైన హింస కొనసాగుతూనే వుంది. వెస్ట్ మిడ్నాపూర్ లో కేంద్ర మంత్రి మురళీధరన్ కాన్వాయ్ పై కొందరు దుండగులు నేడు దాడి చేశారు. ఈ దాడిలో కేంద్ర మంత్రి వ్యక్తిగత సిబ్బంది గాయపడ్డారు.

ఇది కచ్చితంగా తృణమూల్ గూండాల పనేనని మురళీధరన్ ట్వీట్ చేశారు. దాడి అనంతరం తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని వెళ్ళిపోయారు కేంద్రమంత్రి. ఎన్నికల ఫలితాల అనంతరం పలుచోట్ల బిజెపి కార్యకర్తలు, కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఈ దాడులపై తక్షణం నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం శాఖ బెంగాల్ గవర్నర్ ని కోరింది. నిన్న ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కూడా హింసను అరికట్టాలని గవర్నర్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్