Saturday, January 18, 2025
Homeసినిమాప్లాస్మా దానం చేయండి - చిరు, నాగ్ పిలుపు

ప్లాస్మా దానం చేయండి – చిరు, నాగ్ పిలుపు

కోవిడ్‌ బారిన పడిన బాధితులకు అండగా నిలబడాలని కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు ప్లాస్మాను దానం చేసి కష్ట సమయంలో ప్రాణాలను కాపాడాలని మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున పిలుపునిచ్చారు. టీ హోప్‌ అనే స్వచ్చంద సంస్థలో అందరూ భాగం కావాలని కోరుతూ నాగార్జున ట్వీట్‌ చేశారు.

ఇక చిరంజీవి ట్విట్టర్ లో స్పందిస్తూ.. సెకండ్ వేవ్ లో కరోనా బాధితులు మరింతగా పెరుగుతున్నారని, ముఖ్యంగా ప్లాస్మా కొరత వలన చాలా మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారని, వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ‘మీరు కరోనా నుంచి కొద్ది రోజుల ముందే రికవరీ అయినట్లయితే.. మీ ప్లాస్మాని డొనేట్ చేయండి. దీని వలన ఇంకో నలుగురు కరోనా నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడిన వారవుతారు. నా అభిమానులు కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లాస్మా డొనేషన్ గురించి వివరాలకి, సరైన సూచనలకి చిరంజీవి ఛారిటబుల్ ఫౌండేషన్ ఆఫీస్ 040 – 23554849, 94400 55777 ఈ నెంబర్లో సంప్రదించండి’ అని మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్