Monday, January 20, 2025
HomeTrending Newsమే 13న రైతు భరోసా, 18న మత్స్యకార భరోసా

మే 13న రైతు భరోసా, 18న మత్స్యకార భరోసా

ఈ ఏడాది రైతు భరోసా కింద తొలివిడత సాయాన్ని మే 13న ప్రభుత్వం అందించనుంది. 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో 4, 050 కోట్ల రూపాయలను జమ చేయనుంది . మంత్రివర్గ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వెల్లడించారు. మే 25న వైఎస్సార్ ఉచిత పంటల భీమా నిధులు రైతుల అకౌంట్లలో జమ చేస్తారు. మే 18న వేటకు వెళ్లే మత్స్యకారులకు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద అర్హులైన వారి అకౌంట్లలో 10 వేల రూపాయలు జమ చేస్తారు

7వ తరగతి నుంచి సిబిఎస్ఈ సిలబస్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. , 44,639 ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన జరగనుంది.

ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం – 2016కు సవరణ చేయాలని కేబినెట్ తీర్మానించింది. ఇకపై ప్రతి యూనివర్సిటీలో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ 25 శాతం మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రభుత్వం అందిస్తుంది.

రాష్ట్రంలో మూసివేసిన సహకార డెయిరీలను అమూల్ సంస్థకు అప్పగిస్తారు.

పరమత సహనం పెంచే విధంగా రాష్ట్రంలోని ‘ఏ’ కేటగిరి దేవాలయాల్లో పనిచేసే అర్చకుల వేతనం రూ . 10 వేల నుంచి 15 వేల రూపాయలకు పెంచారు. ‘బి’ కేటగిరి దేవాలయాల అర్చకులకు రూ. 5వేల నుంచి 10 వేలకు పెంచారు, ఇమామ్ లకు ఇచ్చే గౌరవ భృతిని 5 వేల నుంచి 10 వేల రుపాయలకు పెంచారు. మౌజమ్ ల వేతనాన్ని 3 వేల నుంచి 5 వేల రూపాయలకు పెంచారు. రిజిస్టర్ చేసుకున్న పాస్టర్ లకు 5 వేల రూపాయలు వేతనం ఇవ్వనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఓ 108 వాహనం అందుబాటులో ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్